ఇవాళ సునీత అన్నాడు... రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులే అంటాడు: సజ్జలపై అయ్యన్న ఫైర్

  • సీఎం జగన్ పై వివేకా కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు
  • సీఎం జగన్ హస్తం ఉండొచ్చన్న వివేకా అల్లుడు
  • సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారన్న సజ్జల
వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ ఉండొచ్చంటూ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం తెలిసిందే. అయితే, వివేకా కుమార్తె సునీత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతిలో పావుగా మారారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఇవాళ సునీత చంద్రబాబు చేతిలో పావు అన్నాడని, రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులేనని అంటాడని సజ్జలపై విమర్శనాస్త్రాలు సంధించారు. సజ్జల వంటి నీచుడి క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదని అయ్యన్న మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సజ్జల కామెంట్ల తాలూకు వీడియోను కూడా పంచుకున్నారు.

అటు బుద్ధా వెంకన్న కూడా సజ్జలపై విరుచుకుపడ్డారు. "గతంలో నారాసుర చరిత్ర అని సిగ్గులేకుండా బురదజల్లారు. మరి మీ సాక్షి పత్రికకు ఉన్న సిగ్గు గురించి మాట్లాడడం మర్చిపోయావేం సజ్జలా?" అని ప్రశ్నించారు. "ఆ రోజు చంద్రబాబు చేయించారని చెప్పడానికి లేని సిగ్గు, ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డ సునీత జగనాసుర రక్తచరిత్ర బయటపెడితే వచ్చిందా?" అంటూ మండిపడ్డారు.

Ayyanna Patrudu
Sajjala Ramakrishna Reddy
YS Sunitha
YS Vivekananda Reddy
Chandrababu
CM Jagan

More Telugu News